తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Special Trains: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు

మేడారం వెళ్లే భ‌క్తుల‌కు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 21న మహాజతర జరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు 5 రోజుల పాటు, అలాగే నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు మరో ప్రత్యేక రైలు అందుబాటులో ఉందన్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మేడారానికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతున్నందున భక్తులకు ప్రయాణం సుగమం అవుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని క్షేమంగా దర్శనం చేసుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైల్వే అధికారులు కోరారు.

Also read: Helicopter: మేడారం జాతరకు సర్వం సన్నద్ధం.. అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు

రైలు నెం. 07017, 07018 సిర్పూర్ కాగజ్ నగర్- వరంగల్- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి 10 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరుగుప్రయాణంలో సా. 4 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరి.. రాత్రి 12 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకుంటాయి. ఈ రైళ్లు కాజీపేట టౌన్, హసన్ పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, కొత్తపల్లి, ఓదెల, కొలనూరు, కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్, రేపల్లెవాడ, ఆసిఫాబాద్, రాళ్లపేటలో ఆగనున్నాయి.

అలాగే రైలునెం.07014, 07015 సికింద్రాబాద్- వరంగల్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు చర్లపల్లి, ఘట్ కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, జనగాం, రఘునాథపల్లి, స్టేషన్ ఘనపూర్, పెండ్యాల, కాజీపేట స్టేషన్లలో ఆగనున్నాయి. రైలు నెం.07019, 07020 నిజామాబాద్- వరంగల్- నిజామాబాద్ (వయా- సికింద్రాబాద్) మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నిజామాబాద్ లో ఉ. 7.05 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 1.45 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో వరంగల్ లో మ. 3 గంటలకు బయల్దేరి రా. 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి. ఈ రైళ్లు కాజీపేట, పెండ్యాల, ఘనపూర్, రఘునాథపల్లి, జనగాం, ఆలేరు, వంగపల్లి, భువనగిరి, బీబీనగర్, ఘట్ కేసర్, చర్లపల్లి, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్, వడియారం, మిర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి స్టేషన్లలో ఆగనున్నాయి.

Also read: ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

రైలు నెం. 07023, 07024 వరంగల్- ఆదిలాబాద్- వరంగల్ ప్రత్యేక రైలు ఈ నెల 21న వరంగల్‌లో సా. 4 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌కు రా. 20.35 గంటలకు చేరుకుంటుంది. ఆదిలాబాద్ కు మరుసటి రోజు ఉ. 04.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22న ఆదిలాబాద్‌లో రా. 11.30 గంటలకు బయల్దేరి నిజామాబాద్‌కు మరుసటి రోజు ఉ. 05.20 గంటలకు చేరుకుంటుంది. మ. 12.45 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, హసన్‌పర్తి రోడ్‌, జమ్మికుంట, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కరీంనగర్‌, గంగాధర, లింగంపేట్‌- జగిత్యాల్‌, కోరుట్ల, మెట్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బాసర, ధర్మాబాద్‌, ఉమ్రీ, ముద్ఖేడ్‌, భోకర్, హడ్గావ్ రోడ్, హిమాయత్‌నగర్, సహస్రకుండ్, ధనోరా, కిన్వాత్, అంబారీ స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నంబర్ 07021, 07022 ఖమ్మం-వరంగల్- ఖమ్మం ప్రత్యేక రైలు ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి అదే రోజు మ. 12.20 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం. 07022 వరంగల్- ఖమ్మం ప్రత్యేక రైలు ఫిబ్రవరి 23న మ. 1.55 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రోజు సా. 4.30 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఈ రైలు మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, చింతల్‌పల్లి స్టేషన్లలో ఆగుతుంది. ప్రత్యేక రైళ్లలో సెకండ్ క్లాస్ సిటింగ్ కోచ్‌లు ఉంటాయని, ప్రయాణికులు గమనించగలరని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

‘నరేంద్రమోడీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3కోట్లను కేటాయించింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button