తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

South Central Railway: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 23 ప్రత్యేక రైళ్ల సర్వీసును పొడిగించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్టణం- సికింద్రాబాద్‌ (08579) రైలు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు ప్రతి బుధవారం రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్‌- విశాఖపట్టణం (08580) రైలు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు ప్రతి గురువారం నడవనుంది. విశాఖపట్టణం- తిరుపతి (08583) రైలు ఫిబ్రవరి 5 నుంచి మార్చి 25 వరకు ప్రతి సోమవారం, తిరుపతి- విశాఖపట్టణం (08584) రైలు ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు ప్రతి మంగళవారం నడవనుంది.

Also read: Varanasi Court: జ్ఞానవాపి మసీదు కేసు.. వారణాసి కోర్టు సంచలన తీర్పు

ఇక రైలు నెం. 08543 విశాఖ- ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు ప్రతి ఆదివారం, రైలు నెం. 08544 ఎస్‌ఎంవీటీ బెంగుళూరు- విశాఖపట్టణం మధ్య ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతి సోమవారం రాకపోకలు సాగించనుంది. రైలు నెం. 02809 తిరుపతి- భువనేశ్వర్ మధ్య ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు ప్రతి శనివారం, రైలు నెం. 02810 భువనేశ్వర్- తిరుపతి మధ్య ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. రైలు నెం. 03253 పాట్నా- సికింద్రాబాద్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో నడవనుంది. అలాగే రైలు నెం. 07255 హైదరాబాద్- పాట్నా మధ్య ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు ప్రతి బుధవారం, రైలు నెంబర్ 07256 సికింద్రాబాద్- పాట్నా మధ్య ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి శుక్రవారం నడవనున్నాయి.

మరోవైపు రైలు నెం. 03225 దానాపూర్- సికింద్రాబాద్‌ మధ్య ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి గురువారం, రైలు నెం. 03226 సికింద్రాబాద్‌- దానాపూర్ మధ్య ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి ఆదివారం రాకపోకలు సాగించనున్నాయి. రైలు నెం. 03245 దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ప్రతి బుధవారం, రైలు నెం. 03246 ఎస్‌ఎంవీటీ బెంగళూరు- దానాపూర్ మధ్య ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్‌ 26 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. రైలు నెం. 03251 దానాపూర్- ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 29 వరకు ప్రతి ఆది, సోమవారం, రైలు నెం. 03252 ఎస్‌ఎంవీటీ బెంగళూరు- దానాపూర్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి మే 1 వరకు ప్రతి బుధ, గురువారాల్లో నడవనున్నాయి.

రైలు నెం. దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 6 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి గురువారం, రైలు నెం. 03260 ఎస్‌ఎంవీటీ బెంగళూరు- దానాపూర్ మధ్య ఫిబ్రవరి 8 నుంచి మే 2 వరకు ప్రతి గురువారం నడవనున్నాయి. రైలు నెం. 03247 దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి గురువారం, రైలు నెం. 03248 ఎస్ఎంవీటీ బెంగళూరు- దానాపూర్ మధ్య ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 27 వరకు ప్రతి శనివారం రాకపోకలు సాగించనుంది. రైలు నెం. 03241 దానాపూర్- ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రత్రి శుక్రవారం, రైలు నెం. 03242 ఎస్ఎంవీటీ బెంగళూరు- దానాపూర్ మధ్య ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి ఆదివారం నడవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button