తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana Government: వాహనదారులకు షాక్.. చలాన్లపై వారికి డిస్కౌంట్ లేదు

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న వెహికల్స్ చలాన్లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26 న వాహన చలాన్ల డిస్కౌంట్ పై జీవో జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే డిసెంబర్ 25 తర్వాత వాహనాలపై పడే చలాన్లు 100 శాతం చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. డిసెంబర్ 25 తర్వాత కూడా వాహనాల చలాన్లపై రాయితీ ఉంటుందని అంతా భావించారు. అలా కుదరదని.. డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Also read: Winter Season: దేశంలో చలి పంజా.. గజగజ వణుకుతున్న తెలంగాణ

పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనుకున్నట్లుగానే పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేశారు. డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో తెలిపారు. టూవీలర్, త్రీ వీలర్స్ పై 80 శాతం, టీఎస్ఆర్టీసీ బస్సులపై 90 శాతం, 60 శాతం లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు చెల్లించకుండా పెద్ద సంఖ్యలో పెండింగ్ ఉన్నాయి. కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.

5 Comments

  1. When I originally commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get three emails with the same comment.
    Is there any way you can remove people from that service?
    Cheers!

    Have a look at my homepage vpn special

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button