తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం
Trending

చరిత్రలో ఈరోజు: జూలై 1

జాతీయ వైద్యుల దినోత్సవం

వైద్యరంగంలో విశేష సేవలందించిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి (1 జూలై 1882) సందర్భంగా ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1961 ఫిబ్రవరి 4న భారత ప్రభుత్వం ఆయన సేవలకు గానూ ‘భారతరత్న’తో సత్కరించింది.

పోస్టుకార్డు ఆవిష్కరణ

1879 జూలై 1న మనదేశంలో మొట్టమొదటిసారి పోస్టుకార్డును ప్రవేశపెట్టారు. దాదాపు శతాబ్దం పాటు దీనికి ప్రత్యామ్నాయం లేకుండా పోవడంతో ప్రజలు దీనిని ప్రధాన సమాచార వారధిగా ఉపయోగించారు.

అంతర్జాతీయ జోక్ డే

ప్రతి సంవత్సరం జూలై 1న అంతర్జాతీయ జోక్ డేని నిర్వహిస్తారు. ఈ రోజు ప్రజలు జోకులు పంచుకోవడానికి, ఉల్లాసభరితమైన పరిహాసాల్లో పాల్గొనడానికి, నవ్వు యొక్క ఆనందాన్ని స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది.

అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ..

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను)ని ప్రవేశపెట్టింది. GST కింద వస్తువులు, సేవలపై 5%, 12%, 18%, 28% సహా వివిధ పన్ను స్లాబ్‌లుగా వర్గీకరించింది.

పురుషోత్తమ దాస్ టాండన్ మరణం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పురుషోత్తమ దాస్ టాండన్ జూలై 1, 1962న మరణించారు. హిందీకి జాతీయ అధికార భాషా హోదా కల్పించాలని విశేషకృషి చేశారు. ఈయనకు రాజర్షి అన్న బిరుదు కూడా ఉంది.

దేవరకొండ బాలగంగాధర తిలక్ మరణం

తెలుగు కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ 1966 జూలై 1న మరణించారు. ఈయన రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ అన్న కవితా సంపుటికి గానూ 1971లో మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button