తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 30

మహాత్మా గాంధీ మొట్టమొదటిసారి అరెస్ట్

దక్షిణాఫ్రికాలో భారతీయులు, నల్లజాతీయుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహాత్మా గాంధీని 1914లో మొదటిసారి అరెస్టు చేశారు.

అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకలాల (ఆస్టరాయిడ్) దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1908, జూన్ 30న మొదటిసారి ఈ దినోత్సవాన్ని జరిపారు.

సి.ఎన్.ఆర్. జననం

ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న గ్రహీత చింతామణి నాగేశ రామచంద్ర (సి.ఎన్.ఆర్.) రావు 1934లో జన్మించారు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు వెలుగులోకి తెచ్చారు. సి.వి. రామన్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తరువాత ‘భారతరత్న’ ఎంపికైన మూడో శాస్త్రవేత్త.

సనత్ జయసూర్య పుట్టినరోజు

శ్రీలంకకు చెందిన ప్రముఖ ఆల్ రౌండర్ క్రికెటర్ సనత్ జయసూర్య 1969లో జన్మించారు. వన్డే క్రికెట్‌లో 12,000 పరుగులు, 300 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్. 1996 ప్రపంచ కప్ క్రికెట్లో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు.

అల్లరి నరేశ్ పుట్టినరోజు

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ 1982లో జన్మించారు. ‘అల్లరి’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయడం వల్ల ఈయనను అందరూ అలా పిలుస్తారు. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారు. ‘గమ్యం’ చిత్రంలో తన విలక్షణ నటనకు గానూ 2008లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

దాదాభాయి నౌరోజీ వర్ధంతి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దాదాభాయి నౌరోజీ 1917లో మరణించారు. ఈయనను ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button