![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/tsrtc-1.jpg)
ప్రత్యేక కథనం
TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో అపెంట్రీస్ ఖాళీలు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఆర్టీసీ పలు పోస్టులను భర్తీ చేయనుంది. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ నాన్ ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంది. మొత్తం 50 పోస్టులు ఖాళీ ఉన్నాయి.
Also read: Afghanistan: అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభం.. ఆఫ్గాన్ నుంచి ప్రత్యేక కానుక
అభ్యర్థుల వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ మూడేళ్లలో ఫస్ట్ ఇయర్ (నెలకు) రూ. 15 వేలు, సెకండ్ ఇయర్ 16 వేలు, థర్డ్ ఇయర్ రూ.17 వేలు స్టెఫండ్ ఇవ్వనున్నారు. ఆన్ లైన్ అప్లికేషన్లు సమర్పించేందుకు ఫిబ్రవరి 16 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http/tsrtc.telangana.gov.in ని సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.