తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Tsunami Alert: ప్రపంచమంతా న్యూ ఇయర్ సంబరం.. జపాన్ లో మాత్రం భయం భయం

న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్న జపాన్ దేశానికి ప్రకృతి షాకిచ్చింది. అత్యంత భారీ భూకంపం స్థానికులను వణికించింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతగా నమోదైంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పే సమయంలో.. ఉదయాన్నే జపాన్ ప్రజలు బ్యాడ్ న్యూస్ విన్నారు. ఇషికావా కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది.

Also read: Operation Smile: నేటి నుంచి ఆపరేషన్ స్మైల్.. వారి లక్ష్యం అదేనా!

తీవ్ర భూకంపం కావటంతో అక్కడి వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. నీగాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో, ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వటంతోపాటు.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదే విధంగా అలలు 5 మీటర్ల కంటే ఎత్తులో ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అందరూ సముద్రం నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.

భూకంప తీవ్రత 7.5గా నమోదు కావటంతో.. గత జ్ణాపకాలను గుర్తు చేసుకుంటున్నారు జపాన్ ప్రజలు. గతంలో సునామీలు విరుచుకుపడినప్పుడు కూడా 7.5 తీవ్రతతోనే భూకంపాలు వచ్చాయి. దీంతో జపాన్ దేశం వణికిపోతుంది. భూకంపం సముద్రంలో రావటంతో.. సునామీ వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు. న్యూఇయర్ వేడుకలు చాలా వరకు సముద్ర తీరాల్లో ఏర్పాటు చేశారు. జనం కూడా ఎక్కువగా ఆయా ప్రాంతాలకు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే భూకంపంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button