తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Winter Season: దేశంలో చలి పంజా.. గజగజ వణుకుతున్న తెలంగాణ

దేశరాజధాని ఢిల్లీని పొగమంచు అల్లాడిస్తోంది. ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం సమయంలో రోడ్డు కనపడక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం చూపింది. విజిబిలిటీ సరిగా లేకపోవడంతో 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే తెలిపింది.

Also read: South Central Railway: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయ్!

ఢిల్లీలో ఉష్ణోగ్రత కొన్ని చోట్ల 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో విజిబిలిటీ 25 మీటర్లు మాత్రమే ఉంది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌లో డిసెంబర్ 31 వరకు పొగమంచు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర భారతదేశం మొత్తం చలి గాలులతో సతమతమవుతోంది. వాయువ్య ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ను మరికొన్నాళ్లు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు తెలంగాణలోనూ చలి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని.. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు పట్టణాలు, పల్లెల్లో రోడ్లన్నీ దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button