తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IndVsAus Match తెలంగాణ పోలీసులపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం

క్రికెట్ అంటే హైదరాబాద్ (Hyderabad)వాసులకు పిచ్చి. స్వతహాగా క్రికెట్ (Cricket) ప్రియులైన హెదరాబాద్ ప్రజలు సెలవు వస్తే ఉన్న కొద్దిపాటి మైదానాల్లోనే ఆడేందుకు ఇష్టపడతారు. అలాంటి భాగ్యనగరవాసులు భారత జట్టు (India Team) మ్యాచ్ లంటే పడిచస్తారు. ఎప్పుడు నగరంలో మ్యాచ్ (Match)లు జరిగినా స్థాయికి మించి ప్రేక్షకులు హాజరవుతుంటారు. అలాంటి క్రికెట్ ప్రియులకు కోపం తెప్పించేలా తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. అసలే హైదరాబాద్ లో మ్యాచ్ లు జరుగుడం చాలా తక్కువ. లేక లేక జరిగే మ్యాచ్ లను కూడా రద్దు చేసేలా తెలంగాణ పోలీసుల తీరు ఉంది. దీంతో పోలీసుల తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో హైదరాబాద్ లో జరుగాల్సిన మ్యాచ్ మరోచోటికి వెళ్తుందనే వార్తలు వస్తుండడంతో క్రికెట్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.ఇంతకీ ఏం జరిగింది? పోలీసులు ఏం చేశారు? ఎందుకు కోప్పడుతున్నారో తెలుసుకోండి.

చదవండి:  హైదరాబాద్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. భారత్, ఆసీస్ మ్యాచ్ వేదిక మార్పు!

ప్రపంచకప్ (World Cup) ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్‌ (IndVsAus Series) జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించి షెడ్యూల్ (Schedule) ఎప్పుడో విడుదలైంది. సిరీస్ లో రెండు మ్యాచ్ లు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ఈ నెల 23న వైజాగ్ (Vizag) లో, చివరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) షెడ్యూల్ ఖరారు చేసింది. వైజాగ్ మ్యాచ్ కు ఎలాంటి ప్రమాదం లేకున్నా మన హైదరాబాద్ మ్యాచ్ కు మాత్రం ఆటంకం ఎదురవుతోంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల (Election Results) వెల్లడి ఉంది. దీని ఫలితంగా మ్యాచ్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మ్యాచ్ నిర్వహించడం కష్టంగా మారిందని రాచకొండ కమిషనరేట్ పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఫలితాల వెల్లడి సందర్భంగా తాము రాజకీయ భద్రతా కార్యక్రమంలో మునిగి ఉంటామని, ఈ సమయంలో మ్యాచ్ కు భద్రత కల్పించలేమని రాచకొండ పోలీసులు తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు హెచ్ సీఏకు, బీసీసీఐకి సమాచారం ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి.

ఇక్కడే జరగాలని పట్టు
ఈ వార్తల నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగాల్సిన మ్యాచ్ బెంగళూరుకు (Bengalur) తరలిపోతుందని తెలిసింది. ఈ వార్తతో హైదరాబాద్ క్రికెట్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత జరిగే మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూద్దామంటే పోలీసుల తీరుతో తమకు నిరాశ ఎదురవుతోందని మండిపడుతున్నారు. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్ లో లేకలేక రెండు మ్యాచ్ లు ప్రకటించగా.. వాటిలో ఒక మ్యాచ్ కు కూడా పోలీసులు ఇదే తీరున వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. పాకిస్థాన్-న్యూజిల్యాండ్ మ్యాచ్ సెప్టెంబర్ 29న ఉండగా.. అదే రోజు వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారనే వార్తలు వచ్చాయి. ఆ మ్యాచ్ పై కూడా గందరగోళం ఏర్పడగా.. ప్రేక్షకుల (Visiters) నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మార్పు జరగకుండా హైదరాబాద్ లోనే నిర్వహించారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఎన్నికల ఫలితాల పేరుతో మ్యాచ్ ను తమకు దూరం చేసేలా ఉన్నారని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా రాని స్పష్టత
మ్యాచ్ యథావిధిగా నిర్వహించాలని హైదరాబాద్ క్రికెట్ (HCA) ప్రేమికులు కోరుతున్నారు. లేకపోతే ఈనెల 23న వైజాగ్ లో జరిగే తొలి మ్యాచ్ ను హైదరాబాద్ కు, ఇక్కడ డిసెంబర్ 3న జరుగాల్సిన మ్యాచ్ ను వైజాగ్ కు తరలించాలని చెబుతున్నారు. ఈ మేరకు బీసీసీఐ, హెచ్ సీఏ, తెలంగాణ పోలీసులకు క్రికెట్ ప్రియులు సోషల్ మీడియా (Social Media) ద్వారా విజ్ణప్తి చేస్తున్నారు. ఈ మేరకుు ఎక్స్ (ట్విటర్), మెయిల్స్ ద్వారా తమ వినతిని పంపుతున్నారు. అయితే మ్యాచ్ నిర్వహణపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మ్యాచ్ పై సంప్రదింపులు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని సమాచారం. ఏదీ ఏమైనా హైదరాబాద్ లో ఒక మ్యాచ్ ఉండాల్సిదేనంటూ క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button