తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ISPL: క్రికెట్ లో కొత్త పార్మాట్… ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌ టీ10 లీగ్ పై రామ్ చరణ్ పోస్ట్

ఇండియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లోకి మరో కొత్త లీగ్‌‌‌‌ రాబోతుంది.. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ‌చ్చే ఏడాది నుంచి లీగ్ ప్రారంభం అవుతుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. టీ10 ఫార్మాట్‌‌‌‌లో టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ లీగ్‌‌‌‌ను తీసుకొస్తున్నారు. దీనికి ఇండియన్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌)గా పేరు పెట్టారు.

Also Read: ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధుకు చోటు

ఇందులో ఆరు ఫ్రాంచైజీలు

ఇందులో ఆరు ఫ్రాంచైజీలు ముంబై (మహారాష్ట్ర), హైదరాబాద్‌‌‌‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), కోల్‌‌‌‌కతా (వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌), శ్రీనగర్‌‌‌‌ (జమ్మూ అండ్‌‌‌‌ కశ్మీర్‌‌‌‌) ఉండనున్నాయి. ఈ ఆరు టీమ్స్‌‌‌‌ మొత్తం 19 మ్యాచ్‌‌‌‌లు ఆడతాయి. ప్రతి జట్టులో 16 మంది ప్లేయర్లు, ఆరుగురు సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ ఉంటారు. స్టాఫ్‌‌‌‌కు 10 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. ప్రతి ఫ్రాంచైజీ పర్స్‌‌‌‌ కోటి రూపాయలు.

Also Read:  క్రికెట్‌లో కొత్త స్టంప్స్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఫిబ్రవరి 24న వేలం

వేలంలో ప్లేయర్‌‌‌‌ బేస్‌‌‌‌ప్రైస్‌‌‌‌ 3 లక్షలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న వేలం నిర్వహించనున్నారు. మార్చి 2 నుంచి 9 వరకు టోర్నీ జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే క్రికెటర్ల మాదిరిగా ఆడాలని కలలు కనే పదుల సంఖ్యలో యువకుల కోసం ఈ చొరవ తీసుకున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కోశాధికారి ఆశిష్ షెలార్‌, ముంబై క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అమోల్ కాలేలు ఐఎస్‌పీఎల్ క‌మిటీ స‌భ్యులుగా ఉన్నారు.

Also Read: టీమిండియాకు భారీ షాక్.. జట్టుకు దూరం కానున్న కీలక ప్లేయర్?

హైదరాబాద్ టీమ్ ని కొన్న రామ్ చరణ్

ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌ లీగ్ పై X లో హీరో రామ్ చరణ్ పోస్ట్ పెట్టాడు. ఇందులో ఓనర్ షిప్ సాధించినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్ట్రీట్ క్రికెట్ ని సెలబ్రెట్ చేయడం, కొత్త టాలెంట్ ని ఎంకరేట్ చేయడమేనని తెలిపారు. ‘గ‌ల్లీ క్రికెట్ లీగ్ హైద‌రాబాద్ జ‌ట్టుకు య‌జ‌మాని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎస్‌పీఎల్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు జైత్ర‌యాత్ర కోసం, అంద‌మైన జ్ఞాప‌కాల్ని పోగు చేసుకునేందుకు నాతో చేతులు క‌ల‌పండి’ అని మెగా ప‌వ‌ర్ స్టార్ ఈ విష‌యాన్ని X వేదిక‌గా రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button