Babu Mohan: బీజేపీకి మరో ముఖ్యనేత రాజీనామా… ఆ పార్టీ చీఫ్ పై తీవ్ర విమర్శలు
సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. పార్టీలోని తాజా పరిస్థితులతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Also Read: సంక్షేమానికి భారీగా కేటాయింపులు… ఏపీ బడ్జెట్ ఎంతంటే?
గత కొంతకాలంగా పార్టీలో ఇమడలేకపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించారు.