తెలుగు
te తెలుగు en English
వ్యాపారం

Jio Cloud: కేవలం రూ.15 వేలకే ల్యాప్ టాప్.. త్వరపడండి

నేటి సాంకేతిక యుగంలో ఎలక్ట్రానిక్ పరికరాలు (Electric Devices) తప్పనిసరి. స్మార్ట్ ఫోన్లతోపాటు కంప్యూటర్, ల్యాప్ టాప్ వినియోగం సర్వసాధారణమైంది. కానీ ఇప్పటికీ మధ్య తరగతితోపాటు పేదలకు అవి కొనడం ఖర్చుతో కూడుకున్నవే. అలాంటి వారి కోసమే జియో (Jio) ఓ అద్భుతమైన ప్రకటనతో మీ ముందుకు వచ్చింది. కేవలం రూ.15 వేలకే ల్యాప్ టాప్ ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జియో క్లౌడ్ ల్యాప్ టాప్ (Jio Cloud Laptop) పేరిట తీసుకు రాబోతున్నది.

Also Read సీఎం కేసీఆర్ స్టైల్లో రిపోర్టర్లకు ధమ్కీ ఇచ్చిన హీరో నాని

కొత్తగా తీసుకువస్తున్న ఈ ల్యాప్ టాప్ లో ప్రాసెసర్ (Processor), స్టోరేజ్ (Storage) ప్రత్యేకంగా ఉండదు. రెండూ జియో క్లౌడ్ లోనే ఉంటాయి. ల్యాప్ టాప్ ఓ డంబ్ టెర్మినల్ ఏర్పడి వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. దీంతో వినియోగదారులు (Consumers) అన్ని సేవలను అత్యంత వేగంగా పూర్తి చేసుకునేందుకు దోహదం చేస్తుంది. వాస్తవంగా ల్యాప్ టాప్ లో మెమొరీ స్టోరేజ్, ప్రాసెసర్లు అత్యంత కీలకం. అవే చాలా విలువైనవి. అయితే ఈ ల్యాప్ టాప్ లో వాటి అవసరం లేదు. జియో క్లౌడ్ లోనే ప్రాసెసర్, స్టోరేజ్ ఉంటుంది. దీంతో రూ.15 వేలకే ల్యాప్ టాప్ అందించే అవకాశం ఉంది.

చదవండి:  ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు భారీ షాక్..

ఈ ల్యాప్ టాప్ ల తయారీ కోసం యాసర్ (Acer), హెచ్ పీ (HP), లెనోవో (Lenovo) కంపెనీలతో జియో చర్చలు చేస్తోంది. వాటితో చర్చల అనంతరం కొద్ది రోజుల్లోనే జియో క్లౌడ్ ల్యాప్ టాప్ ను మార్కెట్ లో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర స్మార్ట్ ఫోన్ (Smart Phone) ధర కంటే చవకగా ఉండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ల్యాప్ టాప్ ను కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button