Animal: యానిమల్ మూవీకి సూపర్ టాక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
సందీప్ వంగా, రణబీర్ కపూర్ కాంబోలో విడుదలైన మూవీ ‘యానిమల్’. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటోంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్, యాక్షన్ సీన్లు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మూవీ విడుదలైంది. కాగా.. రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా యానిమల్ మూవీ నిలిచింది. మొదటిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.
Also read: Salaar Trailer: యూట్యూబ్ లో సలార్ హవా.. రికార్డులన్నీ బ్రేక్
ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా రూ.116 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. భారత్‌లో రూ.55 కోట్లు రాబట్టి ఈ ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాల తర్వాతి స్థానంలో నిలిచింది. బాలీవుడ్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు వీకెండ్ ఉండటంతో సినిమాకు రాబడి పెరిగే అవకాశం ఉంది.