తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Animal: ‘యానిమ‌ల్’ మూవీపై జావేద్ అక్తర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కౌంటర్ ఇచ్చిన మేకర్స్

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి, వంగా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్ప‌టివ‌ర‌కు రూ.900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లను రాబట్టింది. కాగా, ఈ సినిమాపై బాలీవుడ్ సీనియ‌ర్ లిరిక్ రైట‌ర్, ఐదు జాతీయ అవార్డుల విన్నర్‌ జావేద్ అక్తర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

ALSO READ: సలార్ నుంచి వరల్డ్ ఆఫ్ ఖాన్సార్ వీడియో రిలీజ్

ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదకరం

ఔరంగాబాద్‌లో ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జావేద్ అక్తర్ ప్రస్తుత సినిమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు యానిమల్ సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇలాంటి సినిమాలు హిట్ కావడం ప్రమాదకరమని తెలిపాడు. ఈ సినిమాలో ఒక సీన్‌లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం, అలాగే మరొక్క సీన్‌లో మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం వంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదకరమని జావేద్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డారు.

ALSO READ: కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్… యాక్షన్ సీన్స్ లో దుమ్ములేపిన ధనుష్

రచయితకు కౌంటర్..

కాగా, తాజాగా, జావేద్ అక్తర్‌ను ట్యాగ్‌ చేస్తూ యానిమల్ మేకర్స్ ట్వీట్ చేశారు. ‘జోయా, రణ్‌వీర్‌ మధ్య ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేదు. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు’ అంటూ రిప్లై ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button