తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Filmfare Awards 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ మూవీగా 12th ఫెయిల్

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ 2024 జాబితా విడుదలైంది. 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గుజరాత్‌ రాష్ట్రం గాంధీ నగర్‌లో జరిగిన ఈ వేడుకలో అవార్డ్స్‌ జాబితాను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి విజేతలను ప్రకటించారు.

Also read: Mahesh Babu: రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్.. ఫ్రీగా చేయనున్న సూపర్ స్టార్

ఈ జాబితాలో 12th ఫెయిల్‌ బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. ఈ చిత్ర దర్శకుడు విధు వినోద్‌ చోప్రా బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డున సొంతం చేసుకున్నాడు. ఇక యానిమల్‌ చిత్రానికి గానూ రణ్‌బీర్‌ కపూర్‌కు ఉత్తమ నటుడు అవార్డు వరించింది. రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ చిత్రానికి గానూ అలియాభట్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. మరోవైపు ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటిగా షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ) ఎంపికయ్యారు.

అవార్డుల జాబితా:

  • బెస్ట్ మూవీ: 12th ఫెయిల్‌
  • బెస్ట్ మూవీ (క్రిటిక్స్‌): జొరామ్‌
  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి: అలియాభట్‌ (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ)
  • బెస్ట్ సాంగ్ రైటర్: అమితాబ్‌ భట్టాచార్య (తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్చే)
  • బెస్ట్ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌
  • బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): భూపిందర్‌ బాబర్‌ (అర్జన్‌ వెయిలీ– యానిమల్‌)
  • బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చెలెయ్‌– జవాన్‌)
  • బెస్ట్ స్టోరీ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
  • బెస్ట్ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • బెస్ట్ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ)
  • బెస్ట్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ (యానిమల్‌)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: అవినాష్‌ అరుణ్‌ దావరే ( త్రీ ఆఫ్‌ అజ్‌),
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: జస్కున్వర్ సింగ్ కోహ్లీ- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్ డిజైన్: సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
  • బెస్ట్‌ సౌండ్ డిజైన్: కునాల్ శర్మ (సామ్ బహదూర్), సింక్ సినిమా (యానిమల్)
  • బెస్ట్‌ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (వాట్ జుమ్కా?- రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్‌ కహానీ)
  • బెస్ట్‌ యాక్షన్: స్పిరో రజాటోస్, అన్ల్ అరసు, క్రెయిగ్ మాక్రే, యాన్నిక్ బెన్, కెచా ఖంఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
  • బెస్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌: రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ (జవాన్)
  • బెస్ట్‌ డెబ్యూట్‌ డైరెక్టర్‌: తరుణ్ దూదేజా (ధక్ ధక్)
  • బెస్ట్‌ డెబ్యూ మేల్‌: ఆదిత్య రావల్ (ఫరాజ్)
  • బెస్ట్ డెబ్యూ ఫీమేల్: అలిజే అగ్నిహోత్రి (ఫారీ)
  • లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: డేవిడ్ ధావన్
  • ఆర్.డి. బర్మన్ అవార్డ్ ఫర్ అప్ కమింగ్ మ్యూజిక్ టాలెంట్: శ్రేయ పురాణిక్ (యానిమల్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button