తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Janhvi Kapoor: యువకుడితో జాన్వీకుపూర్ పూజలు.. ఎవరతను?

బాలీవుడ్ ​నటి జాన్వీ కపూర్,​ ఎన్టీఆర్ కలిసి దేవర సినిమాలో నటిస్తున్నారు. దేవర మూవీ ఉండగా జాన్వీకి ఆఫర్లు వస్తున్నాయట. శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలైన జాన్వీని తెర‌పై చూసుకుని ఆనందించాల‌ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దేవరలో జాన్వీ పల్లెటూరి పడుచులా కనిపిస్తోన్న పోస్టర్ రిలీజ్ అయ్యాక.. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

Also read: Ritika Singh: తలైవా 170 షూటింగ్.. హీరోయిన్ కి గాయాలు

తాజాగా.. ఓ విషయం కుర్ర కారుకు మతిపోగుతోంది. ఏమంటే.. జాన్వీ కపూర్ చిన్ననాటి స్నేహితుడైన శిఖ‌ర ప‌హారియాతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోంద‌ని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అందులోను ప‌హారియా ఫ్యామిలీతో బోనీ కపూర్ కుటుంబానికి చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈ పెళ్లి వార్తలకు బలమైన కారణాలు కూడా తెలియడంతో.. వీరిపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ జంట మంగళవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ వీరిద్దరూ కలిసి స్వామికి పూజలు చేశారు. దీంతో ఇక ఈ జంట త్వరలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడ్డట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే విషయంపై ఇరు కుటుంబాలు స్పందిస్తేనే రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button