తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Shubman Gill: పంజాబీ ఆల్బమ్ నటిస్తున్న భారత్ క్రికెటర్.. హీరోయిన్ తో లండన్ లో చక్కర్లు

వన్డే ప్రపంచకప్‌ 2023 తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ విశ్రాంతి తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడని గిల్.. లండన్‌కు వెళ్లాడు. అక్కడి వీధుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే గిల్ పక్కన బాలీవుడ్‌ హాట్ నటి అవనీత్‌ కౌర్‌ ఉండడం విశేషం. గిల్, అవనీత్‌ లండన్‌లో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also read: Gerald Coetzee: ఓ ఇంటివాడైన సఫారీ క్రికెటర్.. వధువు ఎవరంటే?

శుభ్‌మాన్ గిల్‌, అవనీత్‌ కౌర్‌ ఓ పాట షూటింగ్‌ కోసం లండన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ పంజాబీ ఆల్బమ్‌ కోసం గిల్, అవనీత్‌ లండన్‌కు వెళ్లారట. వీరితో పాటు నిర్మాత రాఘవ శర్మ, అన్షుల్‌ గార్గ్‌ కూడా ఉన్నారు. వీరంతా కలిసి లండన్‌ వీధుల్లో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. భారత జట్టులో ఇప్పటికే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న గిల్‌.. ఈ పంజాబీ ఆల్బమ్‌లో నటిస్తే అది బంపర్‌ హిట్‌ అవడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button