తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Trisha: త్రిషపై నటుడు మన్సూర్ అసభ్యకర వ్యాఖ్యలు… నటికి మద్దతుగా సినీతారలు

లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ …నటి త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. అయితే ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్‌ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Also Read: సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మన్సూర్ చేసిన వ్యాఖ్యలు

లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసిందని… కానీ సినిమాలో ఒక్క బెడ్‌రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నానని తెలిపారు. తను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్‌కు తీసుకెళ్తానని అనుకున్నట్లు చెప్పారు. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశానని… సినిమాల్లో అలాంటి సన్నివేశాలు అతని కొత్త కాదన్నారు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం తనకు చూపించలేదంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఘాటుగా స్పందించిన త్రిష

ఇక తాజాగా ఈ ఘ‌ట‌న‌పై త్రిష ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ తన గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో ఆమె దృష్టికి వచ్చిందని తెలిపారు. తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైందిగా అనిపిస్తోందని మండిపడ్డారు. అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్ప‌టివ‌ర‌కు స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు తాను అదృష్టవంతురాలినంటు విమర్శించారు. తన మిగిలిన కెరీర్ లో అలాగే తన సినిమాలో అతడు లేకుండా చూసుకుంటానని స్ఫష్టంచేశారు. ఇక ఈ విష‌యంపై త్రిష‌కు పలువురు సినీతారలు మద్దతు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button