తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Yash: యష్ కొత్త సినిమా.. టైటిల్ వీడియో విడుదల

కేజీఎఫ్ తరువాత కన్నడ హీరో యష్ చేయబోయే సినిమా కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు యష్ చేయబోయే సినిమాపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. దీంతో ఆయన తరువాతి సినిమాపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also read: Hi Nanna: ఓటిటిలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. ఎప్పుడంటే?

తాజాగా తన తరువాతి సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు యష్. తరువాతి సినిమా టైటిల్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. యష్ కెరీర్ లో 19వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు టాక్సిక్ అనే మాసీవ్ టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకపోయినా.. ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు వీడియోలో ప్రకటించారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తరువాత యష్ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియెస్ట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button