![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/allari-naresh_V_jpg-816x480-4g-780x470.webp)
Aa Okkati Adakku: అల్లరి నరేశ్ కొత్త సినిమా అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు అల్లరి నరేశ్. ఇటీవల నా సామిరంగ సినిమాతో హిట్‌ను ఖాతాలో వేసుకున్నఅల్లరి నరేశ్.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఈవీవీ సత్యనారాయణ కాంబోలో 1992లో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సెటైరికల్ కామెడీ బూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఈవీవీ తనయుడు అల్లరి నరేష్ వస్తున్నాడు. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా, మేకర్స్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
ALSO READ: దేవర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం
అన్ని భాషల్లో పెళ్లి ఎప్పుడు..
ఈ గ్లింప్స్‌లో అల్లరి నరేష్‌ను చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా పెళ్లి ఎప్పుడు.. అని అన్ని భాషల్లో అడిగేస్తుంటారు. దీంతో ఫన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.