తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Actor Nani: కడప దర్గాను సందర్శించిన హీరో నాని

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని కడపలో ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. ఈ మేరకు దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నాని మాట్లాడారు. కడప ద‌ర్గాలో తనకు మొక్కు ఉన్నందున వచ్చానని.. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. అంత‌కుముందు కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ స‌మయంలో కూడా నాని కడప ద‌ర్గాను ద‌ర్శించుకున్నారు. అదే విధంగా నాని విజయదుర్గాదేవి ఆలయాన్ని సైతం సందర్శించారు. త్వరలో విడుదల కానున్న ‘హాయ్ నాన్న’ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, తండ్రీ కుమార్తెల మధ్య నడిచే ‘హాయ్‌ నాన్న’ మూవీ అందరి మనసులో నిలిచిపోయేలా ఉంటుందని న్యాచురల్‌ స్టార్‌ నాని కోరారు.

ALSO READ: మైసూరు లో “గేమ్ ఛేంజర్”… చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈనెల 7న ‘హాయ్‌ నాన్న’

నాని న‌టిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. ‘నాని 30’గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాల్​ ఠాకూర్ హారోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తుండగా.. బేబి కియార నానికి కుమార్తెగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button