తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోకు అనారోగ్యం.. షూటింగ్‌ వాయిదా

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప-2. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘పుష్ప’ అఖండ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ పుష్పను ఇమిటేట్ చేస్తూ రీల్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈసినిమాతో ఐకాన్ స్టార్ జాతీయ అవార్డ్ అందుకోవడంతో పాటు బెస్ట్ మ్యూజిక్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా నేషనల్ అవార్ట్ సొంతం చేసుకున్నారు.

ALSO READ:  ఓటిటిలోకి వచ్చేస్తోన్న పొలిమేర2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెగ కష్టపడుతున్న బన్నీ..

ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటమ్‌ సాంగ్‌ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్‌ చేశారు. అయితే ఆ పాట షూటింగ్‌ వాయిదా పడింది. అల్లు అర్జున్‌ అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో ఈనెల రెండో వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ మూవీని టీం ఓ యుద్దంలా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button