తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Animal Movie: రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌బీర్ కపూర్ మూవీ

బాలీవుడ్ న‌టుడు రణబీర్ కపూర్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 1న రిలీజైన యానిమల్.. బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. మొద‌టిరోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొద‌టిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వ‌సూలు చేయ‌గా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వ‌సూలు చేసింది. ఇక మూడో రోజు వ‌రల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా మూవీ కలెక్షన్ల వివరాలను ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ వెల్లడించింది. ఈ మూవీ తొలి ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. యానిమల్’ వారం రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. వ‌రల్డ్‌వైడ్‌గా రూ.527 కోట్లు వసూళ్లు రాబట్టింది.

ALSO READ: రేవంత్‌రెడ్డిపై బయోపిక్ తీస్తా.. బండ్ల గణేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తొలి ఐదు రోజుల్లోనే..

ఇక ఇండియాలో యానిమల్ కలెక్షన్ల విషయానికి వస్తే తొలి ఐదు రోజుల్లోనే రూ.283 కోట్లు వసూలు చేసింది. మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.250 కోట్లు, తెలుగు, కన్న‌డ‌, తమిళ్, మ‌ల‌యాళం కలిపి మొత్తంగా రూ.33 కోట్లకు పైగా నెట్‌ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. కాగా, యానిమల్ మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button