తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bandla ganesh: రేవంత్‌రెడ్డిపై బయోపిక్ తీస్తా.. బండ్ల గణేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై బయోపిక్ తీస్తానని ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి జర్నీ మొత్తం ఒక మంచి సినిమా తీసేంత స్టఫ్ ఉందని, ఒక వీరుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రేవంత్ స్టోరీ అంత గొప్పగా ఉంటుందని, ఆయన అంగీకరిస్తే త్వరలోనే తన బయోగ్రఫీ మొత్తాన్ని ఓ సినిమాగా తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను హైలెట్ చేస్తూ బయోపిక్ తీయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో 60 సీన్లు ఉంటాయని, రేవంత్ రెడ్డి లాంటి వీరుడి కథ తీస్తే మామూలుగా ఉండదని, తెలుగుతోపాటు అన్ని భాషాల్లో తీస్తే బాక్సాఫీస్ రికార్డులు పగిలిపోతాయన్నారు.

ALSO READ: ఎవరూ నిరాశకు గురికావద్దు… ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్

ఎంతో మంది విలన్లు

రేవంత్ రెడ్డి రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తి అని, ఆయన కొండారెడ్డి పల్లిలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. ఆయన ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని వెల్లడించారు. ఆయన జీవితంలో ఎంతో మంది విలన్లు ఉన్నారని, ఆయనను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గణేష్ అన్నారు. ఆయనకు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసన్నారు. ఎక్కడైతే ఇబ్బందులు పెట్టారో అక్కడే ఓ వీర నాయకుడిగా అధికారం చేపడుతున్నారన్నారు.

ALSO READ: లోక్ సభ ఎన్నికల బరిలో కేసీఆర్.. అక్కడి నుంచేనా పోటీ?

కూతురి వివాహంలో అడ్డంకులు

రేవంత్ ఇంటి దగ్గర స్కూల్ జర్నీ నుంచి హైదరాబాద్ వచ్చి డిగ్రీ చేయడం ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోవడం వరకు అనేక అంశాలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు ఎన్నో ఆశల నడుమ తన కుమార్తె పెళ్లి జరిపిస్తుండగా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని తన కుమార్తె వివాహాన్ని సంతోషంగా జరుపుకోలేని విధంగా చేశారన్నారు. అంతేకాదు 17 ఏళ్లుగా రేవంత్ రెడ్డికి తన భార్య ఎంతో మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో రేవంత్ ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసం చేస్తున్న పోరాట ఫలితం ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు.

ALSO READ: సినీ నటుడు జగదీష్ అరెస్ట్… రిమాండ్ కు తరలింపు

విద్యార్థి లీడర్ టూ సీఎం..

విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదిగిన తీరు అద్భుతం అన్నారు. అంతకుముందు జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలు పెట్టి, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరేళ్లలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వంటి విషయాలు సైతం బయోపిక్‌లో ఉంటాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమని బండ్ల గణేష్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన..కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కానున్న రెండో వ్యక్తిగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button