తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: ఎవరూ నిరాశకు గురికావద్దు… ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్

ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం పట్ల ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ‌కు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్ర‌జ‌లు ఎప్పటికీ వదులుకోలేరన్నారు.

Also Read: రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం… పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే

ప్రస్తుత ఓటమి తాత్కాలికంగా స్పీడ్ బ్రేక‌ర్ మాత్ర‌మే అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇది స్వ‌ల్పకాలం మాత్ర‌మేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమ‌లు కోసం ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడుదామని పిలుపునిచ్చారు. ప‌వ‌ర్ పాలిటిక్స్‌లో అధికారం రావ‌డం పోవ‌డం స‌హ‌జమే అన్నారు. ప్ర‌జ‌లు తమకు కూడా రెండుసార్లు అవ‌కాశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో కూడా రాణిస్తామని, సిరిసిల్ల‌లో ఓటుకు డ‌బ్బులు, మందుపంచ‌న‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నట్లు చెప్పారు.

Also Read: ఆశీర్వదించండి.. రాష్ట్ర ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ

అనుకున్న ఫలితం రాలేదు

గ‌త 100 రోజులుగా దాదాపు ఆగ‌స్టు 21న కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌టించిన త‌ర్వాత నేటి వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు అహ‌ర్నిశ‌లు, ఎన్నో ర‌కాలు ప్ర‌య‌త్నాలు చేసి శ్ర‌మించి గెలుపు కోసం చాలాచాలా క‌ష్ట‌ప‌డ్డారని తెలిపారు. వారికి హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానని చెప్పారు. 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి శ్ర‌మించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితం రాలేదని గ‌తం కంటే మంచి మెజార్టీ సాధిస్తామ‌నే ఆశాభావంతో ఎన్నిక‌ల‌కు వెళ్లామని కానీ అనుకున్న ఫ‌లితం రాలేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button