తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hi Nanna: నాని సినిమా నుంచి బిగ్ అప్‌డేట్.. మెలోడి సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమాతో శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నాని 30గా వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. కాగా, ఫీల్‌గుడ్‌ లవ్ స్టోరీ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మేళవింపుతో ఉన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫిప్త్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

ALSO READ: భారీ రేటుకు హాయ్ నాన్న ఓటీటీ రైట్స్.. ఎవరు తీసుకున్నారంటే?

అలా ఎగసే అలాలా..

హార్ట్ బీట్ అఫ్ హాయ్ నాన్నగామేకర్స్ ఐదో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండగా.. ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్‌తో ఐదుకు చేరింది. అయితే ఆరో సాంగ్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. అలా ఎగసే అలాలా.. అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ అందరినీ అలరిస్తుంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటకు హేషమ్‌ స్వరపరచగా.. ఈ సాంగ్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఖుషికి బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అల్బమ్ అందించిన హేషమ్.. దీనికి కూడా అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button