తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

LB Stadium: రేవంత్ రెడ్డి తొలి ఉద్యోగం ఇచ్చేది ఆమెకే..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేపట్టకపోవడమే. ఆ ఒక్క కారణంతోనే యువత మొత్తం కేసీఆర్ (KCR) పాలనకు వ్యతిరేకమైంది. దాని ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పరాజయం మూటగట్టుకోవడం. ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇక ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి (Revanth Reddy) తొలి ఉద్యోగం ఒకరికి ఇవ్వనున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read సచివాలయం ముందు సంబరాలు.. ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ లు

హైదరాబాద్ (Hyderabad)లోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని కలిసింది. గాంధీభవన్ (Gandhi Bhavan)లో రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఎంఏ చేసినా తనకు ఎక్కడా ఉద్యోగం లభించడం లేదని రేవంత్ కు తెలిపింది. మరుగుజ్జుగా ఉండడంతో ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగం రావడం ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా విన్న రేవంత్ ఆమె వివరాలు రాసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనూహ్యంగా రేవంత్ సీఎం అవుతుండడంతో రజనీకి కొత్త జీవితం రానుంది.

Also Read ఎల్బీ స్టేడియంలో బండ్ల గణేశ్ హల్ చల్.. రాత్రి అక్కడే నిద్ర

ఎల్బీ స్టేడియంలో (LB Stadium) జరిగే ప్రమాణస్వీకారానికి రావాలని రజనీకి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రజనీకి ఉద్యోగ అవకాశం (Job Oppurtunity) కల్పిస్తారని సమాచారం. కాగా, రేవంత్ ఆహ్వానంపై రజనీ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రమాణస్వీకారానికి తాను వెళ్తానని రజనీ తెలిపింది. తొలి ఉద్యోగం తనకు వస్తుందని ఆనందంలో మునిగింది. మరి రజనీకి రేవంత్ ఎలాంటి ఉద్యోగం ఇస్తారో అనే ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button