తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Revanth Reddy: రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం… పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.అయితే.. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి తొలి ఉద్యోగం ఇచ్చేది ఆమెకే..

ట్రాఫిక్ ఆంక్షలు

సీఎం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. సీఎం ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో రేపు ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. దాదాపు ల‌క్షమంది స‌భ‌కు హాజ‌రు కావొచ్చునని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఎల్బీ స్టేడియంలో ముప్పై వేలమంది కూర్చోవచ్చునని స్పష్టం చేశారు. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Also Read: మహిళల ఉచిత ప్రయాణానికి కసరత్తు.. రంగంలోకి బెంగళూరు అధికారులు

కట్టుదిట్టమైన భద్రత

ముఖ్యంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాదారులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. ఎల్బీ స్టేడియం, లక్డీకాపూల్ సహా పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని డీజీపీ రవిగుప్తా చెప్పారు. మరోవైపు భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button