తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bheema: భీమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్… ఫీల్ గుడ్‌గా ఏదో ఏదో మాయ

టాలీవుడ్ న‌టుడు గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. సాలిడ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ మ్యూజిక‌ల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ అనే సాంగ్‌ను మేక‌ర్స్ లాంఛ్ చేశారు.

Also Read: గీతా ఆర్ట్స్‌తో మరోసారి బోయపాటి మూవీ… క్రేజీ హీరోతో ప్లాన్

కల్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను రవి బస్రూర్ కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. గోపీచంద్, మాళవిక శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్‌గా సాగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో న‌టిస్తుండ‌గా.. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button