తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Buchi Babu: రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి… ఆర్సీ16 నుంచి క్రేజీ అప్‌డేట్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరో బంపరాఫర్ కొట్టేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఉప్పెన మూవీ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో #RC16 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా ఏ హీరోయిన్ ను నటిస్తోందోనని ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు ప్రచారం జరిగింది.

Also Read: బాలయ్య 109 మూవీ అప్డేట్.. లక్కి ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్

ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్.. #RC16లో రామ్ చరణ్ కు జోడీగా నటించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 2024, మార్చి 6వ తేదీ జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో జగదేకవీరుడు కొడుకు.. అతిలోక సుందరి కూతరికి జోడీ కుదురిందంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: అల్లరి నరేష్ కొత్త మూవీ అప్డేట్.. ‘ఓ మేడమ్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. జాన్వీ కపూర్‌ ఇప్పటికే టాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు జాన్వీ పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button