తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Buchibabu Sana: ఆసక్తిగల నటీనటులకు బంపర్ ఆఫర్… రాంచరణ్‌తో నటించే అవకాశం

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్, ‘ఉప్పెన’ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన క‌ల‌యిక‌లో ఓ సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఇక ‘ఆర్‌సీ 16’ అని వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రలో జరిగే క్రీడా నేపథ్యంలో రానుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జ‌రుపుకుంటుండ‌గా.. తాజాగా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారికి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు.

Also Read: బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ… టైటిల్ పోస్టర్ విడుదల

ఉత్తరాంధ్ర భాష అనర్గళంగా మాట్లాడగల నటీనటులకోసం ‘ఆర్‌సీ16’ టీమ్‌ టాలెంట్‌ హంట్‌ నిర్వహించనున్న‌ట్లు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన తెలిపాడు. ఇక విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, బొబ్బలి ప్రాంతాల్లో ఫిబ్ర‌వ‌రి 07 నుంచి 17వ తేదీ వరకూ ఆడిషన్స్‌ నిర్వహిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్రకు చెందినవారు.. నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిబాబు సాన వెల్ల‌డించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button