తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Baby John: బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ… టైటిల్ పోస్టర్ విడుదల

వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా ఒక హిందీ సినిమా రూపొందుతోంది. వరుణ్ ధావన్ కి ఇది 18వ సినిమా .. అందువలన V18గానే ఈ ప్రాజెక్టును తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకి ‘బేబీ జాన్’ అనే టైటిల్ ను ఖరారు చేసి .. టైటిల్ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది.

Also Read: లాల్ సలామ్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

తమిళంలో విజయ్ చేసిన ‘తెరి’ సినిమాకి ఇది రీమేక్. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ జోడీగా సమంత నటించింది. అక్కడ ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అట్లీ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కలీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. జాకీష్రాఫ్, రాజ్ పాల్ యాదవ్ కీలకమైన పాత్రలను పోషిస్తూ ఉండగా, వామికా గబ్బి ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button