తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Lal Salaam: లాల్ సలామ్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న లాల్ సలామ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా లాల్ సలామ్ సెన్సార్ కంప్లీట్ చేసుకుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి యు / ఏ (U/A) సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు.

Also read: Salaar: సలార్ నుంచి మరో అప్డేట్.. కాటేరమ్మ వీడియో సాంగ్ రిలీజ్

లాల్ సలామ్ ఒక ఎమోషనల్‌ జర్నీ అని.. మెయినుద్దీన్ పాత్రలో రజినీకాంత్ ఎంట్రీ ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. థియేటర్స్‌లో ఈ సినిమాను చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారని సెన్సార్ బోర్డు వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే..2 గం.32 నిమిషాలుగా ఉండనుందని సమాచారం.

లాల్ సలామ్ మూవీ క్రికెట్‌, కమ్యూనిజం చుట్టూ జరిగిన అల్లర్లతో రాబోతుంది. ఈ మూవీలో రజనీకాంత్ రోల్.. పవర్ ఫుల్ గా ఉండనుంది. మెయినుద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించిన తీరు, ఇంటెన్స్ లుక్స్ తో టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే లాల్ సలామ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, ఈ మూవీ అమెరికా, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.

న‌టి జీవిత రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button