తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటన.. బుమ్రా అరుదైన రికార్డ్

ఇంగ్లాండ్ పై వైజాగ్ టెస్టులో 9 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన మెన్స్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ను వెనక్కి నెట్టి కెరీర్ లో తొలిసారి నెంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్నాడు.

Also read: MS Dhoni: సీఎస్కే ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. ధోనీ రెడీ అవుతున్నాడు

ఇప్పటికే బుమ్రా వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా టెస్టుల్లో కూడా నెంబర్ వన్ కావడంతో మూడు ఫార్మాట్ లలో నెంబర్ బౌలర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఒక బౌలర్ మూడు ఫార్మాట్ లలో నెంబర్ వన్ గా అవతరించడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

గత ఏడాది మార్చి నుండి ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వైజాగ్‌ టెస్టులో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టడంతో రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 881 పాయింట్లు ఉన్నాయి. 851 పాయింట్లతో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడా రెండో స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 9 వ స్థానంలో ఉన్నారు.

ఇంగ్లాండ్ పై రెండు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. టెస్టుల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టీమ్స్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 117 పాయింట్లతో మొదట స్థానంలో.. 117 పాయింట్లతోనే భారత్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో నెంబర్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి విరాట్ కోహ్లీ మాత్రమే 760 రేటింగ్ పాయింట్స్ తో 7 వ స్థానంలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button