తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

HBD Venkatesh: ‘వెంకీ మామ’ టాప్-10 రహాస్యాలు తెలుసా..?

ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) సొంతం. ఆయన సినీ పరిశ్రమలోకి (Movie Industry) వచ్చినప్పటి నుంచి కుటుంబ కథా చిత్రాలకు పెద్దపీట వేస్తాడు. కొన్నేళ్లుగా వెంకీ విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్న వెంకీ నేడు 63వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు (Rama Naidu) వారసుడిగా వెండితెరపైకి వచ్చిన వెంకీ అనంతరం స్వతహాగా సినిమాలు (Movies) చేస్తూ అగ్ర నటుడిగా ఎదిగాడు. వ్యక్తిగతంగా ఆధ్యాత్మికుడు అయిన వెంకటేశ్ సినిమాల్లో మాత్రం భిన్నంగా కనిపిస్తుంటాడు. తెలుగు కుటుంబాల ఆదరాభిమానం పొందుతున్న వెంకటేశ్ జన్మదినం నేడు (డిసెంబర్ 13). ఈ సందర్భంగా పక్కా తెలుగు డాట్ కామ్ తరఫున వెంకటేశ్ కు జన్మదిన శుభాకాంక్షలు. 37 ఏళ్ల సుదీర్ఘ సినిమా కెరీర్ వెంకీకి ఉంది.

Also Read సీఎం ‘బెల్టు’ తీశాడు.. మందుబాబులకు ఇక చుక్కలే!

జననం: 13 డిసెంబర్ 1960
తల్లిదండ్రులు
దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి
కుటుంబం
భార్య నీరజ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు
వెండితెర ప్రవేశం: బాల నటుడిగా ‘ప్రేమ నగర్’ సినిమా
హీరోగా తొలి సినిమా: కలియుగ పాండవులు (1986)
సూపర్ హిట్ సినిమాలు: శ్రీనివాస కల్యాణం, స్వర్ణ కమలం, కూలీ నెం-1, బ్రహ్మపుత్రుడు, ప్రేమ, బొబ్బిల రాజా, చంటి, క్షణం క్షణం, రాజా, జయం మనదేరా, ప్రేమించుకుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరు, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకీ మామ, నమో వెంకటేశ, లక్ష్మి, గురు, ఘర్షణ, దృశ్యం -1,2, ఎఫ్-2, 3 తదితర
బాలీవుడ్ సినిమాలు: అనారి, తఖ్దీర్ వాలా, కిసి కా భాయ్ కిసి కి జాన్
వెబ్ సిరీస్: రానా నాయుడు
ఇష్టాలు: క్రికెట్, కబడ్డీ. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో వెంకీ ప్రధాన ఆటగాడు. ఇక ప్రొ కబడ్డీలో తెలుగు వారియర్స్ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తాడు.
అవార్డులు: 7 నంది, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు
ప్రస్తుత సినిమాలు: సైంధవ్

Also Read ప్రజలకు గద్గద స్వరంతో కేసీఆర్ విజ్ణప్తి

వెంకీ ప్రత్యేకతలు
– మల్టీ స్టారర్ సినిమాలకు వెంకీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అక్కినేని నాగేశ్వర్ రావుతో ‘బ్రహ్మరుద్రులు’, మహేశ్ బాబుతో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్ తో ‘గోపాల గోపాల’, నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’, రామ్ తో ‘మసాలా’, కమల్ హాసన్ తో ‘ఈనాడు’, విశ్వక్ సేన్ తో ‘ఓరి దేవుడా’, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ -2, 3’ సినిమాలు చేశాడు. ఇక రానాతో కలిసి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేశాడు.

  • రామ్ రాజ్ కాటన్, మణప్పురం గోల్డ్ లోన్ వంటి వాటికి వెంకీ అంబాసిడర్ గా ఉన్నాడు.
  • రా అనే అక్షరం వెంకీకి కలిసొస్తుంది. ఆయన సినిమాలో రా అక్షరం ఉండేలా చూసుకుంటాడు.
  • రెండు సినిమాల సిరీస్ లో వెంకీ నటించాడు. దృశ్యం, ఎఫ్-2 సినిమాలు రెండు సిరీస్ లు వచ్చాయి.
  • అక్కినేని కుటుంబంతో అనుబంధం ఉంది. యువ నటుడు నాగచైతన్య వెంకీకి మేనల్లుడు వరుస అవుతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button