తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌లో కాస్ట్లీ ఫైట్.. ఎంత ఖర్చు చేస్తున్నారంటే?

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా, మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌పై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అధీర అప్డేట్… హీరో ఎవరంటే?

కేవలం క్లైమాక్స్ కోసమే..

పూరి జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ కోసం రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో కేవలం క్లైమాక్స్ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పూరి జగన్నాథ్ ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సినీ పరిశ్రమలో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరో రామ్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లతో పాటు వందలాది మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో హై యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలుస్తోంది.ఇక ఈ కాస్ట్లీ ఫైట్‌ సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button