Extra Ordinary Man: ఓటిటిలోకి ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను వంక్కంతం వంశీ తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్ అవుతుందనుకున్నా.. పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. హీరో నితిన్ పాత్ర జనాలను అంతగా మెప్పించలేకపోయింది.
Also read: Sreeleela: శ్రీలీల ఇలా చేస్తే ఎలా.. షాక్ లో ఫ్యాన్స్
ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. హారీస్ జైరాజ్ సంగీతం, కామెడీ వంటివి అన్నీ సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా పెద్దగా సాధించలేకపోయింది.
ఇక ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఓటీటీ లో ఆకట్టుకుంటుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.