తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Gopichand: ప్రభాస్, గోపీచంద్ కాంబోలో మూవీ.. అసలు క్లారిటీ ఎంటీ?

హీరో అనే పదానికి టైలర్ మేడ్ లా ఉంటాడు హీరో గోపీచంద్. ఆ హైట్, ఫిజిక్, కండలు తిరిగిన బాడీ.. ఇలా ఒక మాస్ హీరోకి కావాల్సిన ప్రతీ ఎలిమెంట్ గోపీచంద్ లో కనిపిస్తాయి. అందుకే మాస్ ఆడియన్స్ ఆయన సినిమాల్ని బాగా లైక్ చేస్తారు. అందుకే మరోసారి మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీ భీమా. కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపీచంద్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం కన్నడ దర్శకుడు హర్షకు ఛాన్స్ ఇచ్చాడు. మార్చ్ 8న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్.

Also read: Nayanthara: భర్తను అన్ ఫాలో చేసిన నయనతార.. అసలేం జరిగింది?

మాస్ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజువల్స్, మ్యూజిక్, గోపీచంద్ మాస్ పర్ఫామెన్స్ వెరసి భీమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గోపీచంద్. ఇందులో భాగంగా ప్రభాస్ తో సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రభాస్.. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా.. మీ కాంబోలో సినిమా ఎప్పడు ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా గోపిచంద్.. మా కాంబోలో ఖచ్చితంగా ఒక సినిమా ఉంటుంది. కానీ, అది ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో గోపీచంద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది గోపీచంద్ ను కూడా ఇష్టపడతారు. ఈ కాంబోలో ఇప్పటికే వర్షం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. అందుకే ప్రభాస్, గోపీచంద్ కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇద్దరి హైటూ, పర్సనాలిటీ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అందుకే ఈ కాంబోలో గనుక ఒక సినిమా పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు ఈ కాంబోలో సినిమా పడితే మాత్రం బాక్సాఫీస్ మోతెక్కిపోవడం ఖాయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button