తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు..వైసీపీ మేనిఫెస్టోపై ఉత్కంఠ‌!

బాపట్ల జిల్లా మేదరమెట్లలో ‘సిద్దం’ చివరి సభ జరగనుంది. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సిద్ధం సభలు సక్సెస్ కావడంతో ఈసారి నాలుగో సభ మరింత గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభను ఈనెల పదో తేదీన నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ సభ అనంతరం ఎన్నికల ప్రచారం మొదలవుతుందని వెల్లడించారు.

ALSO READ: వ్యూహం మార్చిన వైసీపీ..మంగళగిరిలో లోకేష్‌పై అభ్యర్థి ఎవరంటే?

వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం..

అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల పదినెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అదే విధంగా ఈ సభలోనే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేయబోతున్నామో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా, గ‌తంలో న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌గ‌న్.. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చారు. మళ్లీ ఇప్పుడు ప్రవేశపెట్టే మేనిఫెస్టో కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాలు ఉంటాయోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. పవన్ పై పోటీకి సీనియర్ నేత?

15లక్షల మంది అంచనా..

మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద మార్చి 3న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభను మార్చి 10వ తేదీన జరపాలని నిర్ణయించినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ మేదరమెట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. మొత్తం15 లక్షల మంది పాల్గొనేలా 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆరు పార్లమెంట్ స్థానాలు, జిల్లాల నుంచి ప్రజలు ఈ సభకు హాజరవుతారని, ఈ సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తామని తెలిపారు.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button