తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bhimaa: గోపిచంద్ లేటెస్ట్ మూవీ అప్డేట్.. భీమా టీజర్ రిలీజ్

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం భీమా. యూనిక్ యాక్షన్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా రాబోతున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న గోపీచంద్ లుక్, భీమా టైటిల్‌ డిజైన్ అదిరిపోయింది.

Also read: Janhvi Kapoor: శ్రీవారి సేవలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చీరకట్టులో ఆకట్టుకున్న జాన్వీ

లేటెస్ట్ గా భీమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యధా యధా ధర్మస్య శ్లోకంతో మొదలైన టీజర్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. హీరో గోపి చంద్ మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. చుట్టూ అడవి.. వెంటాడే రాక్షసులు.. భయపడే జనాలు.. పాడుబడ్డ గుడి.. మధ్యలో అఘోరలు ఇవన్నీ కలిపి.. టీజర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించారు మేకర్స్.

రాక్షసుడుని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో.. గోపి చంద్ ఎంట్రీ అదిరిపోయింది. టీజర్ చివర్లో.. గోపీచంద్ ఎద్దుపై ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో గోపీచంద్ కమ్ బ్యాక్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ పై ఇంటెన్స్ కలిగిస్తోంది. ఈ సినిమాలో గోపి చంద్ కు జోడీగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌ నటిస్తున్నారు. భీమా ఫిబ్రవరి 16న థియేటర్లో రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button