తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: 300కోట్ల మార్క్‌ను చేరుకున్న హన్-మాన్ మూవీ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా..హీరోయిన్‌గా అమృత అయ్యర్ నటించింది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం రూ.50కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా, ఈ మూవీ 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్ విడుదల చేశారు.

ALSO READ: విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ.. చివరి సినిమా ఆయనతోనే?

మరో సరికొత్త రికార్డ్

హనుమాన్ మూవీ కలెక్షన్స్ విషయంలో కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. సంక్రాంతికి రిలీజయిన సినిమాల్లో గత 92 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ హనుమాన్ సినిమా సాధించింది. థియేటర్లు తక్కువగా ఉన్నప్పటికీ హిట్‌టాక్‌ రావడంతో క్రమంగా స్క్రీన్‌ల సంఖ్య పెంచుకుంది. ప్రస్తుతం హనుమాన్‌ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయని, ఇంకా మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button