తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: హనుమాన్ మూవీకి కలెక్షన్ల వర్షం.. 92 ఏళ్ల సినిమా రికార్డు బ్రేక్

హనుమాన్..సంక్రాంతి కానుకగా విడుదలై 20 రోజులు కావస్తున్నా ఈ సినిమా సృష్టిస్తున్న సంచనాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాదరణతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. బాక్సాఫిస్ దగ్గర ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా.. తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది.

Also read: Poonam Pandey: బాలీవుడ్ లో విషాదం.. నటి పూనం పాండే మృతి

ఇటీవల హనుమాన్ సినిమా రూ.250 కోట్లు కలెక్షన్స్ దాటేసిన ఈ సినిమా.. తాజాగా రూ.278 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విధంగా 92 ఏళ్ళ సినీ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది ఈ మూవీ. అంటే.. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా హనుమాన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ 260 కోట్లతో ఆలా వైకుంఠపురంలో సినిమా పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ పొజిషన్ లో నిలిచింది హనుమాన్ మూవీ. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. 92 ఏళ్ళ సినీ చరిత్రలో ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు హనుమాన్ టీం.

దీంతో హనుమాన్ మూవీ లవర్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అంతేకాదు.. ఒక చిన్న సినిమాగా విడుదలై, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఈ రేంజ్ సక్సెస్ అవడం అంటే మాములు విషయం కాదు అంటూ.. హనుమాన్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఓవర్ సీస్ లో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ సెట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button