తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman Movie: ‘హన్‌మాన్’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హన్‌మాన్’. ఈ సినిమాకు జాంబి రెడ్డి ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ విజువల్స్‌ అందరినీ ఇంప్రెస్‌ చేశాయి. టాలీవుడ్ నుంచి రాబోతున్న మచ్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. మూవీ నంచి రిలీజ్ అయిన పొస్టర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్ ప్రకటించారు.

ALSO READ: అంజి గాడు వస్తున్నాడు.. ‘నా సామి రంగ’ బిగ్ అప్‌డేట్

హనుమంతుడి కథ స్ఫూర్తితో..

హనుమాన్ ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 19న లాంఛ్ చేయ‌నున్న‌ట్లు మేకర్స్ తెలిపారు. కాగా, ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ఏషియన్ మహేష్ బాబు మాల్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి కథ స్ఫూర్తితో రూపొందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button