తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hi Nanna: ఎన్నికల వేళ ప్రచారంలోకి దూకిన హీరో నాని

తెలంగాణ కథాంశంతో ‘దసరా’ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరో నాని ఇప్పుడు తెలంగాణలో (Telangana) ప్రచారంలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో నాని కూడా ప్రచారం (Campaign) చేస్తానంటూ ముందుకు వచ్చాడు. ‘మీ ఓటు మాకే వేయాలి’ అంటూ కోరుతూ రాజకీయ నాయకుడి గెటప్ లో బయటకు వచ్చాడు. అయితే నాని తెలంగాణలో (Telangana) ఎన్నికలు ముగిశాక ప్రచారంలోకి రానుండడం విశేషం.

Also Read ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు భారీ షాక్..

ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమా నాని చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు (Promotions) నాని మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా శుక్రవారం కొన్ని ఫొటోలను పంచుకున్నాడు. రాజకీయ నాయకుడి అవతారంలో తెల్ల చొక్కా, ప్యాంట్ ధరించి.. పైన ఒక కోటు.. కండువా వేసుకుని కొత్త లుక్ (New Look)లో కనిపించాడు. రాజకీయ నాయకుల మాదిరే నమస్తే, దండాలు పెడుతూ ఫోజులు ఇచ్చాడు.

Also Read ప్రపంచకప్ హీరో మహ్మద్ షమీకి అదిరిపోయే గిఫ్ట్ రెడీ..

ఈ ఫొటోలు విడుదల చేస్తూ.. ‘ఇది ఎన్నికల సమయం. ఇందులో మనం ఎందుకు చేరకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్ విరాజ్’ అని పోస్టు చేశాడు. తండ్రి, కూతురు మధ్య ఉన్న కథాంశంతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ‘హాయ్ నాన్న’ సినిమా తీశాడు. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోండగా.. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్నది. ఇప్పటికే చిత్రంలోని రెండు పాటలు విడుదల చేశారు. మరి దసరా తర్వాత ‘హాయ్ నాన్న’తో నాని మరి హిట్ కొట్టనున్నాడనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button