తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hero Roshan:’బబుల్ గమ్’ నుంచి సాంగ్ రిలీజ్

దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రోషన్ కు ఇది ఫస్ట్ సినిమా అయినా చాలా కసితో చేసినట్లు కనిపిస్తుంది. విమల నిర్మించిన విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. హీరో రోషన్ కి మాత్రమే కాదు, హీరోయిన్ మానస చౌదరికి కూడా తెలుగులో ఇదే ఫస్టు మూవీ.

Also Read: గురువుకు డార్లింగ్ గిఫ్ట్… ఏమిచ్చాడో తెలుసా?

తాజాగా ఈ సినిమా నుంచి ‘జానూ’ అంటూ సాగే 3rd సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘ఎందుకే ఈ ఆలోచన .. నాకు ఈ రోజున, దేనికే ఈ ఆలాపనా గొంతు తడి ఆరినా’ అంటూ ఈ పాట మొదలవుతోంది. ఈ సాంగ్ ను శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ బాణీకి అనంత్ శ్రీరామ సాహిత్యాన్ని అందించగా, జావేద్ ఆలపించాడు. బీట్ యూత్ మనసులను పట్టుకునేలానే ఉంది. మొదటి సినిమాతో రోషన్ కనకాల ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి.

Also Read: ఫన్‌ అండ్‌ ఎమోషన్స్‌… షారుక్‌ ఖాన్‌ డంకీ ట్రైలర్‌ రిలీజ్

ఇంతకు ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. హబీబీ జిలేబీ అంటూ వచ్చే ఈ పాటను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button