తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hi Nanna: ఓటిటిలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. ఎప్పుడంటే?

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి పాజిటీవ్ టాక్ అందుకుంటోంది. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని – మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Also read: Mangalavaaram: ఓటిటిలోకి మంగళవారం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సినిమా ఓటిటి రైట్స్ ని Netflix సొంతం చేసుకుంది. అలాగే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం “హాయ్ నాన్న” మూవీ రిపబ్లిక్ డే (జనవరి 26) స్పెషల్ గా వచ్చే ఏడాది ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం ఇదే ఫస్ట్.

ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ దక్కించుకుంది. తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల పాత్రలు ఆ ఇద్దరి నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తం తండ్రీ కూతుర్ల బంధాన్ని చూపిస్తుంది. క్లైమాక్స్ స్థాయి, ఎమోషన్స్ ని పండిస్తాయి. నాని కూడా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని గట్టిగానే ప్రమోషన్స్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button