![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/kalki-2898-ad-et00352941-1718111089.avif)
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. హిందీ భాషలో 24 గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలోనే ట్రైలర్-2ను విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారమవుతోంది. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
ALSO READ: తమిళి సైని స్టేజీ మీదనే మందలించిన అమిత్ షా.. అసలేం జరిగింది?
ఇక మూవీ ట్రైలర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ‘ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా నా మనసు భావోద్వేగానికి గురవుతుంది. పురాణాలు, సైన్స్ రెండింటిపై నాకు ఆసక్తి ఎక్కువ. ఈ రెండింటిని కలిపి సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల క్రితం అనుకున్నాను. మా ఆర్టిస్టులందరి సాయంతో మైథాలజీకి సైన్స్‌ను జోడించి ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కించాను. టీమ్ అద్భుతమైన ప్రతిభ, అంకిత భావం వల్లే ఇది సాధ్యమైంది. నా కలని సాకారం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. చిత్రబృందమంతా ఎంతో కష్టపడి పని చేసింది. తెలుగు ప్రేక్షకులతో పాటు. దేశంలోని వారంతా దీన్ని చూసి గర్వపడతారు’ అని అన్నారు.
1m6xo9
jfkjsjnaknfkakfjka ya.com Good girl Good bye