తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bandla Ganesh: కేసీఆర్‌కు బండ్ల గణేష్ సూపర్ ఐడియా.. ఏంటంటే?

కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువై ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ విషయాలపై ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అదిరిపోయే సలహా ఇచ్చారు.

ALSO READ: సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

సీఎం పోస్ట్ ఖాళీగా లేదు

తెలంగాణలో ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదని.. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయన్నారు. అయినా మళ్లీ పదేళ్లు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటుందనే విషయంలో మాకు సందేహం లేదన్నారు. కేసీఆర్‌కు అర్జెంట్‌గా ముఖ్యమంత్రి కావాలని ఉంటే వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రయత్నం చేసుకోవాలని సూచించారు. కొత్తగా బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా.. ఎక్కడన్నా మీ పార్టీని ఇంప్రూవ్ చేసుకోవాలని.. డెవలప్ చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button