తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Love Me: ఓటీటీలోకి రానున్న వైష్ణవి ‘లవ్ మీ’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

‘బేబీ’ హిట్ తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’. దిల్ రాజు నిర్మాణంలో ఘోస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించారు. దిల్ రాజు సోదరుడి తనయుడు ఆశిష్ హీరోగా నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను త్వరగానే ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ: బాలయ్య దురుసు ప్రవర్తనపై స్పందించిన హీరోయిన్ అంజలి!

ఎంచుకున్న కథాంశం బాగున్నా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డీలా పడింది. ఈ నేపథ్యంలో సినిమాను అనుకున్న సమయం కన్నా ముందే ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న ఆహా సంస్థ.. జూన్ 15 లేదా 22న దీనిని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button