తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mangalavaaram: ఓటిటిలోకి వచ్చేస్తున్న మంగళవారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం మూవీ ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రిలీజై భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్ళై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ లో మిస్ అయిన వారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Also read: Guntur Kaaram: గుంటూరు కారం నుంచి కీలక అప్డేట్.. ఐటం సాంగ్ లో డింపుల్?

కొన్నిరోజుల నుంచి ఈ చిత్రం ఓటిటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని, ఆహా కొన్నది అని ప్రచారం జరగ్గా మంగళవారం డిజిటల్ హక్కులను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని కూడా ప్రకటించింది. ఈ సినిమా డిసెంబర్ 26 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫ్యాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button